లిటిల్‌ స్టార్‌ రిథమిక్‌ జిమ్నాస్టిక్‌ కాంపిటీషన్‌: అంజనకు గోల్డ్‌ మెడల్‌

లిటిల్‌ స్టార్‌ రిథమిక్‌ జిమ్నాస్టిక్‌ కాంపిటీషన్‌: అంజనకు గోల్డ్‌ మెడల్‌

హైదరాబాద్, వెలుగు: ఇండియా జిమ్నాస్ట్‌ అంజన గునుకుల.. కేన్స్‌లో జరుగుతున్న 4వ లిటిల్‌ స్టార్‌ రిథమిక్‌ జిమ్నాస్టిక్‌ ఇంటర్నేషన్‌ కాంపిటీషన్‌ టోర్నీలో గోల్డ్‌ మెడల్‌ సాధించింది. రిబ్బన్‌ ఈవెంట్‌లో ఆమె అద్భుతంగా రాణించింది.

హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన అంజన.. జోయ్‌ జిమ్నాస్టిక్స్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. అంతర్జాతీయ వేదికపై అంజనా స్వర్ణ పతకం సాధించడం పట్ల ఆమె తల్లిదండ్రులు, కోచ్ అలికా జో, జోయ్ జిమ్నాస్టిక్స్ అకాడమీ సభ్యులు, తోటి క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.