జెరూసలేం అథ్లెటిక్స్ మీట్‌‌లో అంకిత నేషనల్ రికార్డు

జెరూసలేం అథ్లెటిక్స్ మీట్‌‌లో అంకిత నేషనల్ రికార్డు

న్యూఢిల్లీ: ఒలింపియన్ అంకిత ధ్యాని ఇజ్రాయెల్‌‌లో జరిగిన గ్రాండ్ స్లామ్ జెరూసలేం అథ్లెటిక్స్ మీట్‌‌లో  విమెన్స్ 2000 మీటర్ల స్టీపుల్‌‌ఛేజ్ గోల్డ్ నెగ్గి  నేషనల్ రికార్డు సృష్టించింది. వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్‌‌ సిల్వర్ లెవెల్ కేటగిరీ అయిన ఈ ఈవెంట్‌‌లో 23 ఏండ్ల అంకిత 6 నిమిషాల 13.92 సెకండ్లలో రేసును పూర్తి చేసి టాప్ ప్లేస్ సాధించింది. ఈ క్రమంలో పారుల్ చౌదరి పేరిట ఉన్న(6:14.38 సె)రికార్డును బ్రేక్ చేసింది. 

ఈ విజయంతో అంకితకు ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తద్వారా వచ్చే నెలలో టోక్యోలో జరిగే వరల్డ్ చాంపియన్‌‌షిప్‌‌లో 3000 మీటర్ల స్టీపుల్‌‌ఛేజ్‌‌కు వరల్డ్ ర్యాంకింగ్ కోటా ద్వారా అర్హత సాధించే అవకాశాలను మెరుగు పరుచుకుంది. కాగా, గత నెలలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌‌లో అంకిత 3000 మీటర్ల స్టీపుల్‌‌ఛేజ్‌‌లో రజతం నెగ్గింది. 2024 ఒలింపిక్స్‌‌లో ఆమె 5000 మీటర్ల రేసులో పాల్గొంది.