మాళవికకు అన్మోల్ షాక్

మాళవికకు అన్మోల్ షాక్

ఆస్టానా :  ఇండియా యంగ్ షట్లర్ అన్మోల్ ఖర్బ్ కజకిస్తాన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. బుధవారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లో క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగిన 17 ఏండ్ల అన్మోల్ 21–13, 22–20తో ఇండియాకే చెందిన టాప్ సీడ్ మాళవిక బన్సొద్‌‌‌‌‌‌‌‌కు షాకిచ్చింది. ఇతర మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో

అనుపమ ఉపాధ్యాయ 21–13, 21–13తో హర్షితా రౌత్‌‌‌‌‌‌‌‌ను ఓడించగా, తన్యా హేమనాథ్‌‌‌‌‌‌‌‌ 21–19–21–10 తో ఐహని తివారిపై నెగ్గింది. కేయూర 21–18, 21–13తో వానెసా గార్సియా (మెక్సికో)ను ఓడించింది. మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో రోహన్ కపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–గద్దె రుత్వికా శివాని 21–16, 21–11తో బొలొలిడిన్‌‌‌‌‌‌‌‌–డయానా గరమోవా (ఉజ్బెకిస్తాన్‌‌‌‌‌‌‌‌)పై నెగ్గారు.