
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై రాజకీయాల నుంచి బ్రేక్ తీసుకున్నారు. మూడు నెలల పాటు లండన్ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో జరగబోయే ఫెలోషిప్ అనే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. లీడర్‌షిప్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్, చెవెనింగ్ గురుకుల్ ఫెలోషిప్ కోసం అన్నామలై యొక్క దరఖాస్తు అంగీకరించబడిందని అందుకు అతను బీజేపీ హైకమాండ్ ను మూడు నెలలు రాజకీయాల నుంచి బ్రేక్ కావాలని కోరినట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి.
ఇప్పుడు అది నిజమేనని పార్టీ వర్గాలు కన్ఫామ్ చేశాయి. క్రియాశీల రాజకీయాలకు మూడు నెలల విరామం ఇవ్వాలని ఆయన బీజేపీ హైకమాండ్‌ను కోరారు. ఆయన ఫెలోషిప్‌కు హాజరు కావాలనుకుంటున్నారని ఆయన దాని గురించి చాలా స్పష్టంగా ఉన్నారని తెలిపారు. అన్నామలై దరఖాస్తును బీజేపీ ఆమోదించిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.