
ఖమ్మం మున్సి పల్ కార్పొరేషన్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసి న అన్నపూర్ణ కేంద్రం పేదలకు వరంగా మారింది. చుట్టు పక్కల గ్రామాల నుంచి వివిధ పనుల కోసం నగరానికి వచ్చే వారి కడుపు నింపే అక్షయ పాత్రగా మారింది. పెవిలియన్ గ్రౌండ్ సమీపంలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ కేంద్రంలో రోజూ వందలాది మంది పేదలు రూ.5కే భోజనం చేస్తూ కడుపునింపుకుంటున్నారు. చదువుకునేందుకు జిల్లా కేంద్ర గ్రంథాలయానికి వచ్చిన వారు, హాస్పిటళ్లకు వచ్చిన వారు, రిక్షా కార్మికులు, ఆటో డ్రైవర్లు, పంటలను అమ్ముకునేందుకు మార్కెట్ కు వచ్చిన రైతులు, హాస్టళ్లలో ఉన్న పిల్లలను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులు, రోజు వారీగాపని వెతుక్కునే కూలీలు, బస్టాండ్ సమీపంలో చెప్పులు కుట్టుకునే వారు, మెకానిక్ లు ఇలా చాలా మందికి తక్కువ ధరకే భోజనం దొరుకుతుండడంతో అందరూ అక్కడికే క్యూ కడుతున్నారు .