
ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సత్యదేవుని ప్రసాదంతో పాటు, ఆలయంలో అందుతున్న సేవలకు గాను రెండు విభాగాల్లో అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ఐఎస్‌వో ఆలయానికి ISO 9001-2015 గుర్తింపునిచ్చింది.
ఆ సంస్థ ప్రతినిధులు ఇందుకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని ఆలయ చైర్మన్ ఐవీ రోహిత్, ఈవో సురేష్ బాబుకు అందించారు. సత్యదేవుడి ప్రసాదం నాణ్యత, భద్రత ప్రమాణాలు పాటించడంలోనూ ISO 22000-2015 గుర్తింపును ఇచ్చామని వారు వివరించారు.