
హైదరాబాద్, వెలుగు: ఇండియన్ ఈక్విటీలు, ఇంటర్నేషనల్ ఈక్విటీలు, ఆర్బిట్రేజ్, ఫిక్స్డ్ ఇన్కమ్, గోల్డ్ సిల్వర్‌తో సహా విభిన్న అసెట్ క్లాస్‌లలో పెట్టుబడి పెట్టే ఓపెన్- ఎండ్ స్కీమ్ బంధన్ మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ కొత్త ఫండ్ వివిధ అసెట్క్లాసుల్లో పెట్టుబడులను పెట్టడం ద్వారా రిస్కును తగ్గిస్తుంది. వృద్ధి, స్థిరత్వం, ద్రవ్యోల్బణ రక్షణ పరంగా ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది.
కొత్త ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ) ఈ నెల పదో తేదీన ప్రారంభమై 24న ముగుస్తుంది. లైసెన్స్ పొందిన మ్యూచువల్ ఫండ్ పంపిణీదారులు, పెట్టుబడి సలహాదారులు, ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా బంధన్ మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. భారతీయ, అంతర్జాతీయ ఈక్విటీలు, బంగారం, వెండి వంటి అసెట్స్‌లో డబ్బును ఇన్వెస్ట్ చేస్తారు.