నవంబర్ 17న తెరుచుకోనున్న శబరిమల ఆలయం

నవంబర్ 17న తెరుచుకోనున్న శబరిమల ఆలయం

శబరిమలలో వార్షిక మండలం, మకరవిళక్కు యాత్రికుల సీజన్ నవంబర్ 17న ప్రారంభం కానుంది. ఈ ఏడాది మండల మకర విళక్కు వేడుకలు భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు అధికారులు. భక్తులకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు ప్రారంభించారు. గతేడాది సుమారు 50 లక్షల మంది భక్తులు శబరిమలను సందర్శించారు., ఈసారి పెరిగే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు. 

ఈ ఏడాది మండల మకర విళక్కు వేడుకలు శుక్రవారం(నవంబర్ 17) నుంచి ప్రారంభం కానుండటంతో అదే రోజు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకోనుంది. అయ్యప్ప స్వామి భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేరళ మంత్రి రాథాకృష్ణ తెలిపారు. భక్తుల సౌకర్యం కోసం అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు డైనమిక్ క్యూ కంట్రోల్ సిస్టమ్ ను అమలు చేయనున్నారు. 

ALSO READ : కార్తీక‌మాసం రెండో రోజు నవంబ‌ర్ 15 పారాయ‌ణం... కార్తిక సోమవార వ్రత మహిమ  ఎంత గొప్ప‌దో తెలుసా...