సెప్టెంబ‌రు 19 నుండి శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు

సెప్టెంబ‌రు 19 నుండి శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుమల శ్రీవారికి ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అధిక మాసం ఏర్పడిన సందర్భంలో భాద్రపద మాసంలో ఒక‌సారి, ఆశ్వియుజ మాసంలో రెండో సారి ఉత్సవాల్ని జరుపుతున్న‌ట్టు తితిదే ప్ర‌క‌టించింది. భాద్రపద మాసంలో కొనసాగే ఉత్సవాల్ని సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా వ్యవహరిస్తారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 19 నుంచి 27 వరకు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 16 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌సింఘాల్‌ వెల్లడించారు. అధికమాసంలో స్వామివారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించే సంప్రదాయం కొనసాగుతుంది. సాలకట్ల బ్రహోత్సవాలకు సెప్టెంబరు 18న అంకురార్పణం జరుగుతుంది. అంకురార్పణతో ఆరంభమైన బ్రహోత్సవాలు చక్రస్నానంతో పరిసమాప్తమవుతాయి.
సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల్లో విశేష‌మైన రోజుల వివ‌రాలిలా ఉన్నాయి.

సెప్టెంబ‌రు 19న – ధ్వ‌జారోహ‌ణం

సెప్టెంబ‌రు 23న – గ‌రుడ‌సేవ‌

సెప్టెంబ‌రు 24న – స్వ‌ర్ణ‌ర‌థోత్స‌వం

సెప్టెంబ‌రు 26న – ర‌థోత్స‌వం

సెప్టెంబ‌రు 27న – చ‌క్ర‌స్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణం.. జ‌ర‌గనున్న‌ట్టు తితిదే ప్రజాసంబంధాల అధికారి ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

ANNUAL SRIVARI BRAHMOTSAVAM FROM SEPTEMBER 19 TO 27