ఏపీలో ఇవాళ్టి నుంచి మరో 13% మద్యం షాపులు రద్దు

ఏపీలో ఇవాళ్టి నుంచి మరో 13% మద్యం షాపులు రద్దు

సంపూర్థ మద్య నిషేధాన్ని దశల వారీగా అమలులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ విషయంపై ఇంతకు ముందే స్పష్టం చేశారు ఆ రాష్ట్రా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీనికి సంబంధించి మరో అడుగు వేసింది. ఇప్పటికే కొన్ని లిక్కర్ షాపులను రద్దు చేసిన ప్రభుత్వం…ఇవాళ్టి(సోమవారం) నుంచి మరికొన్ని షాపులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.ఇందులో భాగంగా సోమవారం(జూన్-1) 535 మద్యం షాపులు మూత పడనున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,500 షాపులను ప్రభుత్వమే ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నడిపిస్తుండగా, వాటిని 2,965కు తగ్గించింది.

వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రాగానే, 20 శాతం షాపులను రద్దు చేసింది. ఇప్పుడు మరో 13 శాతం షాపులు తగ్గడంతో, ఏడాది వ్యవధిలో 33 శాతం షాపులు తగ్గాయి.