హైదరాబాద్లో మరో 70 జీసీసీలు.. రాబోయే ఐదేళ్లలో ఏర్పాటు: ఫిక్కీ

హైదరాబాద్లో మరో 70 జీసీసీలు.. రాబోయే ఐదేళ్లలో ఏర్పాటు: ఫిక్కీ

హైదరాబాద్​, వెలుగు: దేశంలోని  గ్లోబల్ ​కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)లో 20 శాతం హైదరాబాద్​లో ఉన్నాయని, రాబోయే ఐదేళ్లలో మరో 70 ఏర్పాటయ్యే అవకాశం ఉందని ఫిక్కీ తెలిపింది. ఇది రియల్​ఎస్టేట్​కన్సల్టెన్సీ అనరాక్​తో కలసి నిర్వహించిన సదస్సులో  రిపోర్ట్ విడుదల చేసింది. 

దీని ప్రకారం .. కొత్త జీసీసీ వల్ల 75,000కు పైగా హై-స్కిల్డ్ ఉద్యోగాలు వస్తాయి. నగరంలో 500కు పైగా కేంద్రాలు ఏర్పాటయ్యాయి.  ఇవి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. జీసీసీల వల్ల నగర రియల్​ ఎస్టేట్​ కూడా దూసుకెళ్తోంది.