కర్నూల్ బస్సు ప్రమాద ఘటన స్థలంలో మరో ప్రమాదం.. బస్సును తొలగిస్తుండగా క్రేన్ బోల్తా

కర్నూల్ బస్సు ప్రమాద ఘటన స్థలంలో మరో ప్రమాదం.. బస్సును తొలగిస్తుండగా క్రేన్ బోల్తా

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‎లోని కర్నూల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగుళూరు బయలుదేరిన వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శుక్రవారం (అక్టోబర్ 24) తెల్లవారుజూమున చిన్నటేకూరు దగ్గర ప్రమాదానికి గురైంది. ట్రావెల్స్ బస్సును బైక్ ఢీకొనడంతో.. డిజిల్ ట్యాంక్‎కు మంటలు అంటుకుని బస్సు పూర్తిగా దగ్ధమైంది. 

ఈ ప్రమాదంలో 20 మంది మరణించారు. ఘటన స్థలంలో రెస్క్యూ టీమ్స్ యుద్ధ ప్రాతిపదికన సహయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఓ వైపు కర్నూల్ బస్సు ప్రమాద ఘటన స్థలంలో సహయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతుండగానే.. అక్కడ మరో ప్రమాదం జరిగింది.

ప్రమాదానికి గురైన బస్సును రోడ్డు మీద నుంచి పక్కకు తొలగిస్తుండగా క్రేన్ బోల్తా పడింది. ఈ ఘటనలో క్రేన్ ఆపరేటర్‎కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. 20 మంది మృతి చెందిన ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగిస్తుండగా అక్కడే మరో ప్రమాదం జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.