రాడిసన్ పబ్ కేసు: పరారీలో ఉన్న మరో డ్రగ్ ఫెడ్లర్ అరెస్ట్

రాడిసన్ పబ్ కేసు:  పరారీలో ఉన్న మరో డ్రగ్ ఫెడ్లర్ అరెస్ట్

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో  ఏ13 అబ్దుల్ రెహమాన్ ను అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు.  అతనితో పాటు నరేందర్ అనే ఢిల్లీకి చెందిన మరొక నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. వీళ్ల నుంచి 11 గ్రాముల ఎండీఎంఏ, జాగ్వార్ కారు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 

నిందితులు ఢిల్లీ నుంచి  డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నారని డీసీపీ వినీత్ తెలిపారు. హైదరాబాద్ లో 15 మంది ఏజెంట్ల సాయంతో యువత టార్గెట్ గా డ్రగ్స్ విక్రయిస్తున్నారు. పబ్బులకు  వెళ్లే యూత్ ను టార్గెట్  చేసుకుని డ్రగ్స్ విక్రయించారు. హైదరాబాద్ తో పాటు గోవా, బెంగళూరు ముంబయి వంటి మెట్రో నగరాలు పబ్ కల్చర్ ఉన్న ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్ పై  నగరంలో అరు డ్రగ్ కేసులు నమోదు ఉన్నాయి. గచ్చిబౌలి, మలక్ పేట్  , చాదర్ ఘట్, యాదగిరిగుట్ట పీఎస్ లో కేసులు ఉన్నాయి. డ్రగ్స్ అమ్మగా వచ్చిన ఆదాయాన్ని రెహమాన్ విలాసవంతమైన కార్ల కొనుగోలుకు ఖర్చుపెట్టాడు. డ్రగ్స్ అమ్మగా వచ్చిన డబ్బుతో కార్లు కొనుగోలు చేయడానికి నరేందర్ సహకరించేవాడు.

ALSO READ :- రైస్ మిల్లర్లకు మంత్రి వార్నింగ్.. ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకుంటే మిల్లులు సీజ్ చేస్తాం

 రెహమాన్ ఫైజల్ అనే డ్రగ్ ఫెడ్లర్ కింద పనిచేస్తాడు. డ్రగ్స్ కింగ్ ఫిన్ పైజల్ గోవా జైల్లో ఉన్నాడు. అతని ఆదేశాల మేరకు రెహమాన్ డ్రగ్స్ విక్రయిస్తున్నారు. ఫైజాల్ ను  పీటి వారింట్ పై హైదరాబాద్ కు తీసుకొస్తాం. రాడిసన్ పబ్ కేసులో వహీద్ అనే వ్యక్తి సయ్యద్ రెహమాన్తో డ్రగ్స్ కొనుగోలు చేశాడు. రాడిసన్ పబ్ కేసులో మీనన్ యువతికి రెహమాన్ డ్రగ్ సప్లయ్ చేశాడు. రాడిసన్ పబ్ కేసులో ఇప్పటి వరకు ఇద్దరు పరారీలో ఉన్నారు. కోర్టు నుండి అనుమతి వచ్చాక రాడిసన్ పబ్ కేసులో పట్టుబడిన వారికి మళ్లీ బ్లడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేస్తాం.రెహమాన్ కు నైజీరియన్లతో కూడా సంబంధాలు ఉన్నట్టు మా ఇన్వెస్టిగేషన్ లో  తేలింది.