రైస్ మిల్లర్లకు మంత్రి వార్నింగ్.. ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకుంటే మిల్లులు సీజ్ చేస్తాం

రైస్ మిల్లర్లకు మంత్రి వార్నింగ్.. ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకుంటే మిల్లులు సీజ్ చేస్తాం

ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకుంటే చర్యలు తప్పవని రైస్ మిల్లర్లను హెచ్చరించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైతులకు అన్యాయం చేస్తే మిల్లులను సీజ్ చేస్తామన్నారు. పంటనష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో కోమటిరెడ్డిని కలిశారు రైతులు. ధాన్యానికి గిట్టుబాటు రేటు రావడం లేదని తెలిపారు. దీంతో మిల్లర్లతో ఫోన్ లో మాట్లాడిన మంత్రి... క్వింటాకు మూడు వేలు రేటు ఇవ్వాలని ఆదేశించారు. అవసరమైతే ప్రభుత్వమే నేరుగా రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు.గత ప్రభుత్వం జగన్ దగ్గర మోకరిల్లి కృష్ణా,గోదావరి నీళ్లను ఆంధ్రాకు తరలించిందన్నారు కోమటిరెడ్డి. దక్షిణ తెలంగాణను కేసీఆర్ నాశనం చేశారని విమర్శించారు.  

ALSO READ :- తండ్రి భుజంపై నుంచి జారి థార్డ్ ఫ్లోర్ నుంచి కింద పడిన పసివాడు