
హుజురాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హుజూరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిరాధార ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మేకల తిరుపతి ఫిర్యాదుతో ఆయనపై 352, 353(1)(b), 353(2) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. ఇదే విషయమై శనివారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పీఎస్ లోనూ కేసు నమోదైన విషయం తెలిసిందే.