 
                                    హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. అయితే ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని బీఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై మరో కేసు నమోదు అయింది.
గతంలో కూడా సునీత, ఆమె కూతురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. శుక్రవారం (అక్టోబర్31) ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు యత్నించారని సునీతపై బోరబండ పీఎస్ లో ఫిర్యాదు చేశారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి.
టీపీసీసీ మీడియా చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకువిచారణ చేసి బోరబండ పీఎస్ కంప్లయింట్ చేశారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఇప్పటికే మాగంటి సునీతపై రెండు కేసులు నమోదు చేశారు.
మజీద్ దగ్గర ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారని ఓ కసు.. ఆర్వోకి సమాచారం ఇవ్వకుండా మాజీ మంత్రులు పువ్వాడ అజయ్, మల్లారెడ్డితో కలిసి వెంకటగిరి లో భారీ ర్యాలీ నిర్వహించారని మరో కేసు నమోదు అయింది.

 
         
                     
                     
                    