ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లకు మరో చాన్స్

ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లకు మరో చాన్స్

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ ఫస్టియర్ అడ్మిషన్లకు ఇంటర్ బోర్డు మరోసారి అవకాశం కల్పించింది. ఈ నెల 21 నుంచి 27 వరకు అడ్మిషన్ల వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ ఓపెన్ చేస్తున్నట్టు బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని స్టూడెంట్లతో పాటు సర్కారు, ప్రైవేటు, గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీ ప్రిన్సిపాల్స్‌‌‌‌‌‌‌‌ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అక్టోబర్ 15తో అడ్మిషన్ల గడువు ముగియగా, కొత్తగా చేరే స్టూడెంట్లకు బోర్డు మరోసారి అవకాశం ఇచ్చింది. కొత్త స్టూడెంట్లతో పాటు ఇదివరకే కాలేజీల్లో చేరిన స్టూడెంట్ల వివరాలను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ చేయాల్సి ఉంటుంది.

అయితే, కొన్ని సర్కారు, ప్రైవేటు కాలేజీలు విద్యార్థుల వివరాలను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ఎంటర్ చేయలేదు. ఈ క్రమంలో అడ్మిషన్ల లాగిన్ ఓపెన్ చేయాలని కొంత కాలంగా ప్రిన్సిపాల్స్ కోరుతుండటంతో బోర్డు మరోసారి చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. మరోపక్క మిక్స్‌‌‌‌‌‌‌‌డ్ ఆక్యుపెన్సీ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌లోని కాలేజీలు, ఫైర్‌‌‌‌‌‌‌‌ సెఫ్టీ లేని కాలేజీలు, టెన్త్ నుంచి ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్ అయిన గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలకు ఇంకా అధికారికంగా ఇంటర్ బోర్డు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ఆయా స్టూడెంట్ల చదువులపై గందరగోళం నెలకొన్నది.