
కిట్టీ పార్టీల పేరుతో కోట్లకు టోకరా పెట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరిని.. రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లి కోర్టులో హాజరు పరిచారు నార్సింగి పోలీసులు. రెండు రోజుల పోలీస్ కస్టడీ తర్వాత న్యాయవాది ముందు హాజరు పరచి చంచల్ గూడ జైల్ కు తరలించారు. అయితే మరో నాలుగు రోజుల పాటు శిల్పా చౌదరి కస్టడీ కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు నార్సింగి పోలీసులు. దీనిపై విచారించిన ఉప్పర్ పల్లి కోర్ట్ న్యాయమూర్తి.. ఒక్కరోజు కస్టడీకి ఓకే చెప్పారు. కోర్టు ఉత్తర్వులతో రేపు ఉదయం 10 గంటల నుంచి శిల్పా చౌదరిని కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. తిరిగి 15వ తేదీ 11 గంటలకు ఆమెను కోర్టులో హాజరుపరుస్తారు. మరోవైపు శిల్పాచౌదరి వేసిన బెయిల్ పిటిషన్ కొట్టేసింది కోర్ట్.