
బంగాళాఖాతంలో రేపు( ఆదివారం) మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం తూర్పు మధ్యప్రదేశ్ మధ్య భాగం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.