క్యాండిడేట్స్‌‌‌‌ చెస్ టోర్నమెంట్‌‌‌‌లో గుకేశ్‌‌‌‌కు మరో డ్రా

క్యాండిడేట్స్‌‌‌‌ చెస్ టోర్నమెంట్‌‌‌‌లో  గుకేశ్‌‌‌‌కు మరో డ్రా

టొరంటో: క్యాండిడేట్స్‌‌‌‌ చెస్ టోర్నమెంట్‌‌‌‌లో ఇండియా గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్ టాప్ సీడ్ అమెరికా ప్లేయర్ ఫాబియానో కరువానాను నిలువరించాడు. సోమవారం జరిగిన ఓపెన్ సెక్షన్ మూడో రౌండ్ గేమ్‌‌‌‌లో ఫాబియానోతో డ్రా చేసుకున్నాడు. ఆర్. ప్రజ్ఞానంద కూడా హికారు నకామురా (అమెరికా)తో పాయింట్ పంచుకున్నాడు. కానీ, విదిత్ సంతోష్.. ఇయాన్ నెపోమ్నియాచి (రష్యా) చేతిలో ఓడిపోయాడు. 

మూడు రౌండ్లు ముగిసిన తర్వాత ఇయాన్ మూడు పాయింట్లతో టాప్ ప్లేస్‌‌‌‌లో ఉండగా.. కరువానా, గుకేశ్ చెరో 2.5 పాయింట్లతో రెండో ప్లేస్‌‌‌‌లో నిలిచారు. ప్రజ్ఞానంద 2, విదిత్ 1.5 పాయింట్లతో ఉన్నారు. మరోవైపు విమెన్స్‌‌‌‌లో కోనేరు హంపి మూడో రౌండ్‌‌‌‌లో లోయెస్ట్ సీడ్, యంగెస్ట్ ప్లేయర్ నుర్గ్యుల్ సలిమోవా (బల్గేరియా) చేతిలో ఓడింది. ఆర్. వైశాలి.. అలెగ్జాండ్రా గొర్యాచ్కినా (రష్యా)తో గేమ్‌ను డ్రా చేసుకుంది.