పోటీ పరీక్షల కోసం మరో ఇంగ్లీష్ ​బుక్

పోటీ పరీక్షల కోసం మరో ఇంగ్లీష్ ​బుక్

ఓయూ, వెలుగు: టీఎస్​పీఎస్సీ, ఏపీపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడే ఇంగ్లీష్​ పుస్తకాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్​ప్రొఫెసర్ లింబాద్రి మంగళవారం ఓయూ ఆర్ట్స్​కాలేజీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరికానికి  చదువు అడ్డు కాదని, దాన్ని జయించి ముందుకు సాగాలన్నారు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్​అయ్యేవారికి మాగి వెంకన్న రాసిన ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. 

కార్యక్రమంలో ఓయూ వైస్ ​చాన్సలర్​ ప్రొఫెసర్​ రవీందర్, రిజిస్ట్రార్ ​ప్రొఫెసర్ ​లక్ష్మీనారాయణ, టీఎస్​పీఎస్సీ మాజీ చైర్మన్ ​ప్రొఫెసర్​ఘంటా చక్రపాణి, ప్రొఫెసర్ మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.