పాశమైలారం పారిశ్రామిక వాడలో మరో అగ్ని ప్రమాదం

పాశమైలారం పారిశ్రామిక వాడలో మరో అగ్ని ప్రమాదం

 సంగారెడ్డి జిల్లా   పాశమైలారం పారిశ్రామిక వాడలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి.  స్థానికుల సమాచారంతో   ఘటనా స్థలానికి వచ్చిన  ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. 

 ఇటీవలే సిగాచీ ఫ్యాక్టరీ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 44 మంది చనిపోయారు.  ఇంకా 8 మంది మృతదేహాల గురించి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  పలువురు పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సిగాచీ ఘటనపై సీరియస్ అయిన ప్రభుత్వం కంపెనీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రమాద బాధితులకు ఒక్కొక్కరికి రూ. కోటి పరిహారం ఇప్పించింది.