ఢాకా: బంగ్లాదేశ్లో మరో హిందూ యువకుడు హత్యకు గురయ్యాడు. రాజ్ బరి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఈ దారుణ ఘటన జరిగింది. మృతుడిని రిపన్ సాహా (30) గా గుర్తించారు. సాహా.. రాజ్ బరిలోని ఓ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు. ఈ నెల 16 తెల్లవారుజామున కొందరు వ్యక్తులు కారులో వచ్చి పెట్రోల్ పోయించుకున్నారు. బిల్లు చెల్లించకుండా పారిపోతుండగా.. సాహా వారి కారుకు అడ్డంగా నిలబడి బిల్లు చెల్లించాలని అడిగాడు. ఇంతలోనే డ్రైవర్.. సాహాను ఢీకొట్టి అతనిపై నుంచి కారును పోనిచ్చాడు. కాగా, పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.
