మాసోడి మిస్టరీ

మాసోడి మిస్టరీ

కెరీర్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్ చేసి ముప్ఫయేళ్లు దాటినా సూపర్ స్పీడ్‌‌‌‌తో సినిమాలు చేస్తున్నాడు రవితేజ. ఏడాదికి రెండు, మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. తాజాగా మరో  మూవీ టైటిల్‌‌‌‌ అనౌన్స్‌‌‌‌ చేయడంతో పాటు వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. దీనికి ‘ఈగల్ ’అనే టైటిల్‌‌‌‌ను ఫైనల్‌‌‌‌ చేశారు. 

‘మాసోడి మిస్టరీ ఇక షురూ’ అంటూ ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఓ పెయింటర్‌‌‌‌‌‌‌‌ను పట్టుకోడానికి రా ఏజెన్సీ వెతుకుతోంది. కానీ అతను పత్తి పండించే రైతు అని మరికొందరు చెబుతున్నారు. ‘ఒక మనిషి చుట్టూ ఇన్ని కథలేంటి?, ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలు ఏంటి?’ అంటూ అనుపమ పరమేశ్వరన్ చెప్పే డైలాగ్‌‌‌‌, రవితేజ గురించి ఎలివేషన్ ఇవ్వడం ఆకట్టుకుంది. ఈగల్‌‌‌‌తో డిజైన్ చేసిన టైటిల్‌‌‌‌ లోగోతో పాటు  బ్యాక్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌ స్కోరు వీడియోలో హైలైట్‌‌‌‌గా నిలిచాయి. మొత్తానికి ఫస్ట్ వీడియోతోనే సినిమాపై ఆసక్తిని రేకిత్తించారు. రవితేజకి ఇది 73వ సినిమా.  మధుబాల, నవదీప్, కావ్య థాపర్, శ్రీనివాస్ అవసరాల ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.  వివేక్ కూచిభొట్ల కో  ప్రొడ్యూసర్. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.