యూఎస్ ఇమిగ్రేషన్ ఆఫీసర్ల కాల్పుల్లో మరొకరు మృతి

యూఎస్ ఇమిగ్రేషన్ ఆఫీసర్ల కాల్పుల్లో మరొకరు మృతి

వాషింగ్టన్: అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారులు మరో వ్యక్తిని చంపేశారు. ట్రంప్ సర్కార్ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న వేళ ఈ ఘటన జరిగింది. మినియాపొలిస్ లో శనివారం జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా, జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలెక్స్ జెఫ్రీ పెట్టి (37) మినియాపొలిస్ లో నర్సుగా వర్క్ చేస్తున్నారు.

 ఇమిగ్రేషన్ సోదాల్లో భాగంగా అధికారులు అతడిపై కాల్పులు జరపడంతో మరణించాడు. అలెక్స్ తన వద్ద ఉన్న ఆయుధంతో అధికారుల వైపు దూసుకువచ్చాడని, ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరపాల్సి వచ్చిందని డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. అతడి కుటుంబం మాత్రం భిన్నమైన వాదనను వినిపిస్తున్నది. అలెక్స్ ఒక బాధ్యతాయుతమైన నర్సు అని, అతడికి ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని స్పష్టం చేస్తున్నది.