
మీకు ఏమాత్రం సంబంధం లేని డిట్టో మీలాగా ఉండే వ్యక్తి ఎదురుపడ్డారనుకోండి మీ ఫీలింగ్ ఎట్లుంటది! ఏముంది మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురుంటారు కదా.. అందులో ఏ ఒక్కరో అయి ఉంటారులే అంటారా! సరె..సరె, ఇప్పుడిదంతా ఎందుకంటే ఈ ఫొటో చూశారుగా! ఎవరనుకుంటున్నారు.. ఎన్టీఆర్ కదా! అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే మరి. అదేంటి ఎన్టీఆర్‌ను పట్టుకుని ఎన్టీఆర్ కాదంటారేంటి అంటారా? అవును, అతడు ఎన్టీఆర్ కాదు. డిట్టో ఎన్టీఆర్‌లా ఉన్న డూప్ ఎన్టీఆర్. కళ్లు, ముక్కు, చెవులు, మొహం, నోరు ప్రతిదీ దిగిపోయిందంటే నమ్మండి. అతడి పేరు షమీందర్ సింగ్. పంజాబ్‌లో ఉంటాడు. ఎన్టీఆర్‌కు పిచ్చి ఫ్యాన్. వృత్తి రీత్యా ఏరోనాటికల్ ఇంజనీర్ అయిన అతడికి ఫొటోగ్రఫీ అన్నా, మోడలింగ్ అన్నా చాలా చాలా ఇష్టం. టిక్‌టాక్‌లో వీడియోలూ చేస్తుంటాడు. ఇప్పుడు ఎట్టిపరిస్థితుల్లో ఎన్టీఆర్‌ను కలిసి తీరాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఏదో ఒక రోజు తనను చూసి కలవకపోతాడా అని ట్విట్టర్లో ఎన్టీఆర్‌ను ట్యాగ్ చేస్తూ వీడియోలు, అతడి డైలాగులను పోస్టు చేస్తున్నాడు. కానీ, హైదరాబాద్ వస్తే ఎక్కడ ఎన్టీఆర్ అనుకుని జనాలు చుట్టుముట్టేస్తారేమోనని టెన్షన్ పడిపోతున్నాడు. ఈ మధ్యే టిక్‌టాక్‌లో ఓ వీడియో పెట్టాడు. ‘‘నా పేరు షమీందర్ సింగ్. నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టం. నాకు తెలుగు రాదు. తారక్‌ను కలవాలనుకుంటున్నా. ఎన్టీఆర్ అభిమానులు నన్ను చూసి మెసేజ్‌లు కూడా చేస్తుంటారు. మీ అందరి కోసం మా పంజాబీ డాన్స్ చేస్తా” అంటూ పెట్టాడు. మరి, అతడిని చూస్తే ఎన్టీఆర్ ముఖ చిత్రం ఎలా ఉంటుందో!