- నీళ్లుపోసి కాపాడిన పోలీసులు, తోటి కార్మికులు
- కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేస్తుండగా…
ఖమ్మంలో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాహత్నానికి పాల్పడ్డాడు. కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతుండగా ఒక్కసారిగా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు వేంకటేశ్వరాచారి అనే డ్రైవర్. వెంటనే పక్కన ఉన్న కార్మికులు, పోలీసులు అతడ్ని అడ్డుకున్నారు. నీళ్లు పోసి అతడిని కాపాడారు. వద్దురా.. వద్దురా నాన్న అంటూ సర్ది చెప్పి తోటి కార్మికులు వేంకటేశ్వరాచారిని స్థిమితపరిచారు.
ఈ ఘటనకు కొద్ది నిమిషాల ముందే ఖమ్మంలోనే శ్రీనివాస్ రెడ్డి అనే డ్రైవర్ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు మనస్తాపం చెంది శ్రీనివాస్ రెడ్డి సూసైడ్ అటెంప్ట్ చేశాడని కార్మికులు చెప్పారు. శ్రీనివాస్ రెడ్డి సూసైడ్ అటెంప్ట్ తో రగిలిపోయిన… కార్మికులు ఖమ్మం కలెక్టరేట్ దగ్గర నిరసనకు దిగారు. తోటి కార్మికుడి పరిస్థితిని చూసి కుమిలిపోయిన వేంకటేశ్వరాచారి.. కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన కార్మికులు, పోలీసులు అతడిని అడ్డుకున్నారు.

