ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని టెర్రరిస్ట్సంస్థ లష్కరే తొయిబా కమాండర్బిలాల్ఆరిఫ్ సరాఫీ తన కుటుంబసభ్యుల చేతిలోనే హత్యకు గురయ్యాడు. శనివారం రంజాన్సందర్భంగా ప్రార్థనలు చేస్తున్న సమయంలో కత్తులతో దాడి చేసి హత్య చేశారు. పంజాబ్రాష్ట్రం మురిద్కేలోని మార్కజ్ సమీపంలో ఉన్న లష్కరే తొయిబా పాత హెడ్క్వార్టర్స్సమీపంలో ఈ ఘటన జరిగింది.
కుటుంబ విబేధాలే హత్యకు దారితీశాయని ఇంటలిజెన్స్‌వర్గాలు అనుమానిస్తున్నాయి. హంతకులను స్థానిక పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపాయి. మురిద్కే సెంటర్‌లో యువకులను గుర్తించి, వారిని ఉగ్రవాదం వైపు ఆకర్షించడం బిలాల్ఆరిఫ్ ప్రధాన బాధ్యత. యువతకు సిద్ధాంతపరమైన శిక్షణ ఇచ్చి వారికి బ్రెయిన్‌వాష్ చేయడంలో ఇతను కీలక పాత్ర పోషించేవాడు.
దశాబ్దాలుగా ఉగ్రవాద నెట్‌వర్క్‌లను పెంచి పోషించిన పాకిస్తాన్.. ఇప్పుడు అవే సంస్థల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 2025లో ఆ దేశంలో ఏకంగా 1,045 దాడులు జరగ్గా, వీటిలో 1,139 మంది మరణించారు. 1,595 మంది గాయపడ్డారు.
