మహారాష్ట్రలో విషాదం.. ప్రభుత్వ ఆస్పత్రిలో 24 మంది మృతి

మహారాష్ట్రలో విషాదం.. ప్రభుత్వ ఆస్పత్రిలో 24 మంది మృతి

నాందేడ్‌ : మహారాష్ట్రలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మరో విషాదం చోటుచేసుకుంది. ఠాణే ప్రభుత్వ ఆస్పత్రి దుర్ఘటన మరువక ముందే తాజాగా నాందేడ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో మరో దారుణం బయటపడింది. ఒకేరోజు 24 మంది మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. మృతుల్లో 12మంది నవజాత శిశువులు ఉన్నారు. ఆస్పత్రిలో ఔషధాలు, సిబ్బంది కొరత వల్లే ఈ విషాదం జరిగిందని తెలుస్తోంది.

గడిచిన 24 గంటల వ్యవధిలో ఆస్పత్రిలో 24 మంది మృతిచెందగా.. 12 మంది నవజాతా శిశువులు ఉన్నారు. వీరిలో ఆరుగురు మగ శిశువులు ఉండగా.. మరో ఆరుగురు ఆడశిశువులు ఉన్నట్టు ఆస్పత్రి డీన్‌ శంకర్‌రావు చవాన్‌ వెల్లడించారు. మిగతా 12 మంది పలు వ్యాధులు, ముఖ్యంగా పాముకాటు కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. ఆస్పత్రిలో పలువురు సిబ్బందిని బదిలీ చేయడంతో రోగులకు సేవలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. 

ALSO READ : అక్టోబర్ 3న కేయూ బంద్కు విద్యార్థి సంఘాల పిలుపు

ఈ ఘటనపై విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. మూడు ఇంజిన్ల (బీజేపీ, ఏక్‌నాథ్‌ శిందే- శివసేన, ఎన్సీపీ- అజిత్‌ వర్గం) ప్రభుత్వమే ఈ మరణాలకు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.