నిప్పంటించుకున్న ఘటనలో..మరో ట్రాన్స్జెండర్ మృతి

నిప్పంటించుకున్న ఘటనలో..మరో ట్రాన్స్జెండర్ మృతి

జూబ్లీహిల్స్, వెలుగు: బోరబండ బస్టాప్ లో పలువురు ట్రాన్స్​జెండర్లు ఒంటిపై పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకున్న ఘటనలో మరో ట్రాన్స్​జెండర్​ ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 17న బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాప్ లో 50 మందికి పైగా ట్రాన్స్ జెండర్స్ ఆందోళన నిర్వహించారు. 

తమ లీడర్​గా కొనసాగుతున్న మోనాలిసాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ ఒక్కసారిగా 8 మంది  పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. వారంతా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో అప్సాన అనే ట్రాన్స్​జెండర్​ ఈ నెల 20న మృతిచెందారు. ఇదే దవాఖానలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న హీనా ఆదివారం  మృతిచెందారు.