మీకు కోట్లు ఇవ్వలేను.. మీ పిల్లలకు విలువైన చదువు చెప్పించగలను: సీఎం రేవంత్

మీకు కోట్లు ఇవ్వలేను.. మీ పిల్లలకు విలువైన చదువు చెప్పించగలను: సీఎం రేవంత్

ఇరిగేషన్ (వ్యవసాయం), ఎడ్యుకేషన్ (విద్య) తన మొదటి ప్రయారిటీ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సోమవారం (నవంబర్ 24) తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో పర్యటించిన సీఎం.. ప్రజలకు కోట్ల రూపాయలు ఇవ్వలేనని.. పిల్లలకు అంతకంటే విలువైన చదువు చెప్పించగలనని అన్నారు. చదువు జీవితాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని అన్నారు. అందులో భాగంగా కొండంగల్ లో 5 వేల కోట్ల రూపాయలతో ఎడ్యుకేషన్ క్యాంపస్ నిర్మించుకున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

సీఎం రేవంత్ కామెంట్స్:

  • ఎడ్యుకేషన్, ఇరిగేషన్ నా మొదటి ప్రాధాన్యం
  •  ప్రపంచంతో పోటీ పడాలంటే ఈ రెండూ ముఖ్యం
  • క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ దొరుకుంది అంటే కొడంగల్ లో అనే స్థాయికి అభివృద్ధి చేస్తా
  • కృష్ణా నది పక్కనుంచే పోతున్నా చుక్క నీరు మాకు రాలేదు
  • మూడేండ్లలో కృష్ణా నది నీరును తీసుకొస్తా
  • తొందర్లోనే కొడంగల్ కు రైలును తీసుకురాబోతున్నాం
  • 70 ఏండ్ల కొడంగల్ రైతుల కల నెరవేరబోతోంది
  • పరిశ్రమల కోసం ప్రయత్నిస్తుంటే లగచర్లలో రైతులను రెచ్చగొట్టారు
  • రైతులతో మాట్లాడాం.. మంచి పరిహారం ఇచ్చాం
  • నోయిడా తరహాలో కొడంగల్ ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెడతా
  • ఏ ఇంట్లో ఆడబిడ్డ సంతోషంగా ఉంటుందో ఆ ఇల్లు బాగుంటుంది
  • ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలనేదే ఉద్దేశం
  • అదానీ, అంబానీలతో పోటీ పడేలా మహిళలను తయారు చేస్తున్నాం
  • హైటెక్ సిటీ పక్కనే మహిళలకు మూడు ఎకరాలు ఇచ్చాం
  • మహిళలు తయారు చేస్తున్న వస్తువులకు మార్కెట్ కలిపిస్తున్నాం
  • పేదలందరికీ సన్నబియ్యం ఇస్తున్నాం.. ఒకప్పుడు పేదలకు అందని ద్రాక్షే
  • రెండేండ్లలో మహిళలు పైసలు ఇచ్చి టికెట్ తీసుకున్నారా..?
  • వెయ్యి ఆర్టీసీ బస్సులకు మహిళలను ఓనర్లు చేశాం
  • పెట్రోల్ పంపులు మహిళలకు అప్పగించాం
  • మీ పిల్లలకు విలువైన విద్యను ఇవ్వడమే లక్ష్యం
  • కొడంగల్ లో ఏ ఒక్క విద్యార్థి ఆకలితో ఉండకూడదు
  • 312 పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నాం
  • నెహ్రూ గొప్ప విజన్ తోనే దేశం ఈ స్థాయిలో ఉంది