హిందీ సినిమా ఇండస్ట్రీ షాక్. తీవ్ర మనోవేదనతో ఉంది. వెటరన్ యాక్టర్ లెజండరీ ధర్మేంద్ర కన్నుమూశారు. ఈ విషయాన్ని ధర్మేంద్ర ఫ్యామిలీ నుంచి ఎవరూ అధికారికంగా ప్రకటించకపోయినా.. కరణ్ జోహార్ X వేదికగా స్పష్టం చేశారు. అదే విధంగా కొన్ని న్యూస్ ఏజెన్సీలు వెల్లడించాయి. ఇదంతా ఒకటి అయితే.. అధికారికంగా ప్రకటించకపోగా.. బాలీవుడ్ ప్రముఖులు ధర్మేంద్ర ఇంటికి కాకుండా.. నేరుగా ముంబైలోని పవన్ హన్స్ శ్మశాన వాటికకు రావటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ధర్మేంద్ర భార్య హేమమాలిని, ఇసాడియోల్ సైతం ముంబైలోని పవన్ హన్స్ శ్మశాన వాటికకు వచ్చారు. తెలుపు దుస్తుల్లో ఉన్న వీళ్లు.. భావోద్వేగంతో లోపలికి వెళ్లటం కనిపించింది. ముంబైలోని పవన్ హన్స్ శ్మశనావాటిక దగ్గర భద్రత పెరిగింది. పోలీస్ బలగాలు మోహరించాయి. ఈ క్రమంలోనే అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, అమీర్ ఖాన్ వంటి ప్రముఖులు అక్కడికి రావటం జరిగింది. దీంతో ధర్మేంద్ర అంత్యక్రియలు అక్కడే జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి.
2025, నవంబర్ 24వ తేదీ ఉదయం ముంబైలోని ధర్మేంద్ర ఇంటి నుంచి ఓ అంబులెన్స్ బయటకు రావటం కనిపించింది. ఆ తర్వాత అతని ఆరోగ్యం విషమించిందనే వార్తలు వచ్చాయి. ఆ కొద్దిసేపటికే ధర్మేంద్ర కన్నుమూత అంటూ కరణ్ జోహార్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ALSO READ : బాలీవుడ్ దిగ్గజ నటుడు ధరేంద్ర కన్నుమూత
ధర్మేంద్ర కన్నుమూసిన తర్వాత.. అతని ఇంటికి ప్రముఖులు వెళ్లినట్లు కనిపించలేదు. బాలీవుడ్ సీనియర్ నటులు, ధర్మేంద్రతో కలిసి నటించిన నటులు కొందరు నేరుగా శ్మశాన వాటికకు వస్తున్నారు. 90 ఏళ్ల సీనియర్ నటుడు.. సినిమా ఇండస్ట్రీలో మూడు తరాలకు చెందిన నటులకు మార్గదర్శకుడు అయిన ధర్మేంద్ర భౌతికకాయానికి ఇంట్లో కూడా.. నేరుగా శ్మశాన వాటికలోనే నివాళులర్పించే విధంగా కుటుంబం నిర్ణయం తీసుకోవటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
