సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం (నవంబర్ 24) నియోజకవర్గంలో 103 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేశారు. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా నడిపిస్తానని హామీ ఇచ్చిన సీఎం.. అందుకు అనుగుణంగా భారీ ఎత్తున నిధులు కేటాయించారు. సోమవారం పార్టీ నేతలు, కార్యకర్తల నడుమ పలు డెవలప్మెంట్ వర్క్స్ కు శంకు స్థాపన చేశారు.
శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనుల వివరాలు:
- రూ. 5.83 కోట్లతో నియోజకవర్గంలో 28 అంగన్‌వాడీ భవనాల నిర్మాణం
- రూ. 5.01 కోట్లతో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 23 అదనపు తరగతి గదుల నిర్మాణం
- రూ. 3 కోట్లతో నియోజకవర్గంలో 10 GP భవనాల నిర్మాణం
- రూ. 3.65 కోట్లతో బంజారా భవన్ కోసం అదనపు సౌకర్యాలు (కాంపౌండ్ వాల్, డైనింగ్ హాల్, నీటి సరఫరా, విద్యుదీకరణ)
- రూ. 1 కోటితో కొడంగల్‌లో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్‌కు శంకుస్థాపన
- రూ. 1.30 కోట్లతో అగ్నిమాపక కేంద్రం నిర్మాణం.
- రూ. 1.40 కోట్లతో కొడంగల్‌లో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం
- రూ. 4.91 కోట్లతో కమ్యూనిటీ హాళ్లు, కిచెన్ షెడ్లు & కాంపౌండ్ వాల్స్ నిర్మాణం
- రూ. 4.45 కోట్లతో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీలు (యుజిడిలు) నిర్మాణం
- రూ. 2.95 కోట్లతో నిర్మించిన అదనపు తరగతి గదులు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రంథాలయ భవనాల ప్రారంభం
- రూ.60 కోట్లతో కొడంగల్ పట్టణంలో రోడ్డు విస్తరణ
- రూ. 5 కోట్లతో గెస్ట్ హౌస్ నిర్మాణం
- రూ. 4.50 కోట్లతో కోస్గి వ్యవసాయ మార్కెట్‌లో కొత్త అభివృద్ధి పనులు
