Dharmendra Family Tree: ధర్మేంద్ర హ్యాపీ ఫ్యామిలీ.. ఆరుగురు పిల్లలు.. 13 మంది మనవళ్లు మనవరాళ్లు

Dharmendra Family Tree: ధర్మేంద్ర హ్యాపీ ఫ్యామిలీ.. ఆరుగురు పిల్లలు.. 13 మంది మనవళ్లు మనవరాళ్లు

దిగ్గజ నటుడు ధర్మేంద్ర (Dharmendra Deol) మృతితో ఇండియన్ సినీ పరిశ్రమ విషాదంలో మునిగింది. 1935 పంజాబ్లో జన్మించిన నటుడు ధర్మేంద్ర.. తన 89 ఏళ్ల వయసులో 2025 నవంబరు 24న ఆనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఈ దిగ్గజ నటుడు జీవించిన జీవితం ఎంతోమందికి మార్గదర్శంగా నిలిచింది. ఆయనలో నిరాడంబరత, వినయం, తోటివారిని ఆప్యాయంగా పలకరించే వ్యక్తిత్వం ఆయనకే సొంతం.

దశాబ్దాల పాటు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించారు. అయితే, నటుడు ధర్మేంద్ర.. ఒక నటుడిగా, రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా.. భారతీయ సినీ చరిత్రలో ఒక మహోన్నత మానవుడిగా చరిత్రలో నిలిచిపోయేలా జీవించారు. ఈ క్రమంలో నేటి తరం సినీ ప్రపంచం ధర్మేంద్ర గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతుంది. దాంతో అతని సినీ వృత్తి జీవితంతో పాటు, అతని వ్యక్తిగత జీవితం కూడా వెలుగులోకి వచ్చింది.

ధర్మేంద్ర వ్యక్తిగత జీవితం: 

దిగ్గజ నటుడు ధర్మేంద్ర రెండుసార్లు వివాహం చేసుకున్నాడు. అయితే, ధర్మేంద్ర తన 19 సంవత్సరాల వయసులో.. అంటే, నటుడు కాకముందు.. మొదట భార్య ప్రకాష్ కౌర్‌ను 1954లో వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు. వారిలో సన్నీ డియోల్, బాబీ డియోల్, విజేత డియోల్ మరియు అజితా డియోల్.

ఇక ఆ తర్వాత నటుడిగా, స్టార్ స్టేటస్ అనుభవించే క్రమంలో.. అలనాటి హీరోయిన్ హేమా మాలిని ​(1980)లో పెళ్లాడారు. ధర్మేంద్ర మరియు హేమకు ఇద్దరు పిల్లలు. ఈషా డియోల్, అహానా డియోల్.

ఈ లెక్కన చూసుకుంటే.. నటుడు ధర్మేంద్రకు సంతానంగా మొత్తం ఆరుగురు ఉన్నారు. ఈ ఆరుగురు సంతానానికి పెళ్లిళ్లు అవ్వడమే కాకుండా.. వారికి పిల్లలు ఉన్నారు. అలా ధర్మేంద్ర వంశ వృక్షంలో ఆరుగురు పిల్లలు ఉండగా.. 13 మంది మనవళ్లు, మనవరాళ్ళు కలిగి ఉన్నారు. ధర్మేంద్ర కుమారులు, కూతుళ్లు సినీ ఇండస్ట్రీలో పాపులర్ యాక్టర్స్గా రాణిస్తుండటం విశేషం.

ధర్మేంద్ర వంశవృక్షం: 

సన్నీ డియోల్ (ధర్మేంద్ర కుమారుడు) - ఇతనికి ఇద్దరు కుమారులు.. కరణ్ మరియు రాజ్‌వీర్
బాబీ డియోల్  (ధర్మేంద్ర కుమారుడు) - ఇద్దరు కుమారులు. ఆర్యమాన్ మరియు ధరమ్
విజేత డియోల్ (ధర్మేంద్ర కుమార్తె)- ఇద్దరు పిల్లలు - ఒక కొడుకు మరియు ఒక కూతురు. ప్రేరణ, మరియు సాహిల్
అజీతా డియోల్ (ధర్మేంద్ర కుమార్తె) - ఇద్దరు కుమార్తెలు.  నికితా మరియు ప్రియాంక
ఇషా డియోల్ (ధర్మేంద్ర కుమార్తె) - ఇద్దరు కూతుళ్లు. రాధ్య మరియు మిరాయ
అహానా డియోల్ (ధర్మేంద్ర కుమార్తె) - ముగ్గురు పిల్లలు - ఒక కుమారుడు మరియు ఇద్దరు కవల కుమార్తెలు

ధర్మేంద్ర ఫ్యామిలీ ఎక్కడ నివసిస్తుంది?

ధర్మేంద్ర కుటుంబం గురించి చెప్పాలంటే, అతని మొదటి భార్య వేరే ఇంట్లో నివసిస్తుండగా, రెండో భార్య హేమ మాలిని వేరే ఇంట్లో నివసిస్తుంది. ఈ క్రమంలో ధర్మేంద్ర తన ఎక్కువ సమయం లోనావాలాలోని తన ఫామ్‌హౌస్‌లో గడిపాడు.