హైదరాబాద్ లోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం (నవంబర్ 24) హాస్పిటల్ బిల్డింగ్ లో కార్మికులు పని చేస్తుండగా సెంట్రింగ్ కూలటంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు.
హాస్పిటల్ లో బిల్డింగ్ రెనోవేషన్ చేస్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఎమర్జెన్సీ వార్డులో రెనోవేషన్ పనులు చేస్తుండగా.. స్లాబ్ పెచ్చులు ఊడి మీద పడటంతో ప్రమాదం జరిగింది. సెంట్రింగ్ పనులు చేస్తున్న ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
Also read:- హైదరాబాద్ హిస్టరీలోనే రికార్డ్.. కోకాపేట నియో పోలీస్ లేఅవుట్లో..137.25 కోట్లు పలికిన ఎకరం ధర !
