ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో గత రెండు రోజులు ఒక్క ఆటగాడే హైలెట్ గా నిలిచాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కొరకరాని కొయ్యలా మారి టీమిండియాను డేంజర్ జోన్ లో పడేశాడు. అతడెవరో కాదు సౌతాఫ్రికా బౌలింగ్ ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్. రెండో రోజు ఆటలో భాగంగా 93 పరుగులు చేసి సఫారీ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించిన జాన్సెన్.. మూడో రోజు బౌలింగ్ లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టి భారత జట్టును తక్కువ స్కోర్ కే పరిమితమయ్యేలా చేశాడు. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలిస్తే దానికి ప్రధాన కారణం జాన్సెన్ అనే చెప్పాలి.
Also read:- టీమిండియాకు డ్రా కూడా కష్టమే.. రెండో టెస్టులో పట్టు బిగించిన సౌతాఫ్రికా
రెండో రోజు ఆటలో భాగంగా వెర్రెయిన్ వికెట్ తీసి సంతోషంలో మునిగిపోయిన ఇండియాకు జాన్సెన్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. మరి కాసేపట్లో ఆలౌట్ కావడం గ్యారంటీ అనుకుంటే భారత బౌలర్లను చితక్కొట్టాడు. టెస్టుల్లో వన్డే శైలిలో బ్యాటింగ్ చేస్తూ దుమ్ములేపాడు. కేవలం 91 బంతుల్లోనే 93 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. జాన్సెన్ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లతో పాటు ఏకంగా 7 సిక్సర్లున్నాయి. ముత్తుస్వామితో కలిసి 8వ వికెట్ కు 97 పరుగులు జోడించిన జాన్సెన్.. చివరి రెండు వికెట్లను లోయర్ ఆర్డర్ ను పెట్టుకుని 58 పరుగులు రాబట్టాడు. ఇండియాలోని అందరి బౌలర్లను అలవోకగా ఆడి తేన కెరీర్ లో బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు.
మూడో రోజు ఆరు వికెట్లు:
టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో జాన్సెన్ ధాటికి పూర్తిగా తేలిపోయింది. తొలి మూడు వికెట్లు సఫారీలకు స్పిన్నర్ల రూపంలో వచ్చాయి. అయితే ఆ తర్వాత ఈ స్టార్ పేసర్ హవా స్టార్ట్ అయింది. పేసర్లకు అంతగా సహకరించని భారత పిచ్ లపై బౌన్సర్లు విసురుతూ మూడో రోజు రెండో సెషన్ లో మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మొదట పంత్ ను ఔట్ చేసిన ఈ సఫారీ పేసర్ అతి పెద్ద వికెట్ తీసుకున్నాడు. జాన్సెన్ వేసిన బంతిని ముందుకొచ్చి ఆడిన పంత్.. వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
జాన్సెన్ వేసిన బౌన్సర్ ను ఆడే క్రమంలో నితీష్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని బంతి గల్లీ వైపుగా వెళ్ళింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మార్క్రామ్ దూరంగా వెళ్తున్న బంతిని డైవ్ చేస్తూ అందుకున్నాడు. ఇదే ఊపులు ఒక బౌన్సర్ తో జడేజా ను ఔట్ చేయడంతో జాన్సెన్ ధాటికి ఇండియా 122 పరుగుల వద్దకు ఏడో వికెట్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. లంచ్ తర్వాత లోయర్ ఆర్డర్ లో కుల్దీప్, బుమ్రా వికెట్లు తీసుకొని ఓవరాల్ గా 6 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తానికి ఓ వైపు బ్యాటింగ్ లో మరోవైపు బౌలింగ్ లో టీమిండియాను ఈ సఫారీ ఆల్ రౌండర్ దెబ్బ కొట్టాడు.
Marco Jansen puts on a masterclass with the bat and ball in Guwahati.#INDvsSA pic.twitter.com/xSJq0OzQSC
— CricTracker (@Cricketracker) November 24, 2025
గౌహతి వేదికగా జరుగుతున్న ఈ టెస్ట్ విషయానికి వస్తే టీమిండియా పూర్తిగా వెనకపడింది. మూడో రోజు బ్యాటింగ్ లో తేలిపోవడంతో సఫారీలు ఈ టెస్టుపై పట్టు బిగించారు. తొలి ఇన్నింగ్స్ లో 288 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించిన సౌతాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. ర్యాన్ రికెల్టన్ (13), ఐడెన్ మార్క్రామ్ (12) క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో 314 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇప్పటికే ఓటమికి చేరువైన టీమిండియా డ్రా చేసుకోవడం కూడా కష్టంగానే కనిపిస్తోంది.
What a spell of fast bowling 🔥
— ICC (@ICC) November 24, 2025
Marco Jansen bags his fourth five-wicket haul in Tests 👊#WTC27 | #INDvSA 📝: https://t.co/5B1PcNj4kk pic.twitter.com/ulvc0VPrjN
