IND vs SA: టీమిండియాకు డ్రా కూడా కష్టమే.. రెండో టెస్టులో పట్టు బిగించిన సౌతాఫ్రికా

IND vs SA: టీమిండియాకు డ్రా కూడా కష్టమే.. రెండో టెస్టులో పట్టు బిగించిన సౌతాఫ్రికా

సౌతాఫ్రికాతో గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పూర్తిగా వెనకపడింది. మూడో రోజు బ్యాటింగ్ లో తేలిపోవడంతో సఫారీలు ఈ టెస్టుపై పట్టు బిగించారు. తొలి ఇన్నింగ్స్ లో 288 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించిన సౌతాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. ర్యాన్ రికెల్టన్ (13), ఐడెన్ మార్క్రామ్ (12) క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో 314 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇప్పటికే ఓటమికి చేరువైన టీమిండియా డ్రా చేసుకోవడం కూడా కష్టంగానే కనిపిస్తోంది.

వికెట్ నష్టపోకుండా 9 పరుగులతో మూడో రోజ్ ఆట ప్రారంభించిన ఇండియా తొలి సెషన్ లోనే 102 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో నిలిచింది. ఓపెనర్లు రాహుల్, జైశ్వాల్ తొలి వికెట్ కు మంచి ఆరంభాన్ని ఇచ్చినా వరుస విరామాల్లో భారత జట్టు వికెట్లను కోల్పోతూ వచ్చింది. మూడో రోజు టీ బ్రేక్ సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. తొలి సెషన్ లో నాలుగు వికెట్లు చేజార్చుకోవడంతో పాటు టీ విరామం తర్వాత మరో మూడు వికెట్లు కోల్పోయింది. మిడిల్ ఆర్డర్ కూడా పెవిలియన్ కు క్యూ కట్టడంతో మూడో రోజు లంచ్ సమయానికి 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. 

Also read:- ఫైనల్లో సూపర్ ఓవర్ మజా.. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టైటిల్ గెలుచుకున్న పాకిస్థాన్

టీ విరామం తర్వాత కాసేపు పోరాడిన సుందర్ 48 పరుగుల వద్ద ఔటయ్యాడు. కుల్దీప్, బుమ్రా కూడా వెంటనే ఔట్ కావడంతో తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 201 పరుగులకు ఆలౌట్ అయింది. మార్కో జాన్సెన్ సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్  పడగొట్టాడు. తీసుకున్నాడు. హార్మర్ మూడు.. మహరాజ్ ఒక వికెట్ తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో సఫారీలకు 288 పరుగుల ఆధిక్యం లభించినా ఇండియాను ఫాలో ఆన్ ఆడించలేదు. రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 26 పరుగులతో రోజును ముగించింది. ప్రస్తుతం సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో 314 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 489 పరుగులకు ఆలౌటైంది.