BAN vs PAK: ఫైనల్లో సూపర్ ఓవర్ మజా.. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టైటిల్ గెలుచుకున్న పాకిస్థాన్

BAN vs PAK: ఫైనల్లో సూపర్ ఓవర్ మజా.. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టైటిల్ గెలుచుకున్న పాకిస్థాన్

మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టైటిల్ ను పాకిస్థాన్ ఏ జట్టు గెలుచుకుంది. ఫైనల్లో బంగ్లాదేశ్ ఏ పై సూపర్ ఓవర్ లో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టి ట్రోఫీ అందుకుంది. ఆదివారం (నవంబర్ 23) వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్  కూడా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది. సూపర్ ఓవర్ లో బంగ్లాదేశ్ 6 పరుగులు మాత్రమే చేయగలిగింది. 7 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ 4 బంతుల్లో ఛేజ్ చేసి గెలిచింది. 

ఈ మ్యాచ్ లో ఛేజింగ్ చేస్తున్నప్పుడు బంగ్లాదేశ్ కు చివరి రెండు ఓవర్లలో 27 పరుగులు అవసరం. ఈ దశలో పాక్ విజయం ఖాయమని భావించారు. అయితే షాహిద్ అజీజ్ వేసిన ఇన్నింగ్స్ 19 ఓవర్లో అబ్దుల్ గఫార్ సక్లైన్‌ 20 పరుగులు రాబట్టి మ్యాచ్ ను బంగ్లా వైపు తిప్పాడు. చివరి ఓవర్లో బంగ్లా విజయానికి 7 పరుగులు కావాల్సి ఉండగా.. అహ్మద్ డానియల్ కేవలం 6 పరుగులే ఇచ్చి మ్యాచ్ ను టై చేశాడు. చివరి బంతికి రెండు పరుగులు కావాల్సి ఉండగా సింగిల్ మాత్రమే వచ్చింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీయడంతో పాకిస్థాన్ అలవోక విజయాన్ని సాధించి టైటిల్ తమ ఖాతాలో వేసుకుంది. 

ALSO READ : ఫాలో ఆన్ ప్రమాదంలో టీమిండియా..

ఈ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. సాద్ మసూద్ 38 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అరాఫత్ మిన్హాస్ (25), మాజ్ సదఖత్ (23) రాణించారు. మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. బంగ్లా బౌలర్లలో రిపాన్ మోండోల్ మూడు వికెట్లు పడగొట్టి పాక్ ను కట్టడి చేశాడు. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఓపెనర్ హబీబుర్ రెహమాన్ సోహన్ 26 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. పాకిస్థాన్ బౌలర్లలో సుఫియాన్ ముఖీమ్ 4 ఓవర్లలో కేవలం 11 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అహ్మద్ డానియల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. మాజ్ సదఖత్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.