హైదరాబాద్ - విజయవాడ హైవే..చిట్యాల దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ - విజయవాడ హైవే..చిట్యాల దగ్గర  కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

నల్లగొండ జిల్లా జాతీయ రహదారి 65 పై చిట్యాల  దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.  వీకెండ్ అయిపోవడంతో హైదరాబాద్ కు వచ్చే రూట్లో కిలోమీటర్ల మేర  వాహనాలు నలిచిపోయాయి.  చిట్యాల దగ్గర  రోడ్డు పనులు జరుగుతున్నందున  వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో  వాహనదారులు  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు, NHAI సిబ్బంది ట్రాఫిక్ నియంత్రిస్తున్నారు. ఫ్లైఓవర్ పనులు నెమ్మదిగా నడుస్తుండటంతో ప్రతి వీక్ ఎండ్ రోజున ప్రయాణికులు  నరకం చూస్తున్నారు.

వెహికిల్స్ స్లోగా కదులుతుండటంతో.. ఇంకెప్పుడొస్తుందా హైదరాబాద్ అన్నట్లుగా ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. చౌటుప్పల్ ఏరియాలో వాహనాలు బారులు తీరాయి. పంతంగి టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో.. ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. భారీ సంఖ్యలో వచ్చే వాహనాలను త్వరగా పంపించేందుకు టోల్‌‌‌‌ ప్లాజా దగ్గర ఎక్కువ గేట్ల నుంచి హైదరాబాద్‌‌‌‌ వైపు వచ్చే వాహనాలను పంపిస్తున్నారు. ట్రాఫిక్‌‌‌‌లో అంబులెన్స్‌‌‌‌లు సైతం చిక్కుకుపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.