2026 T20 World Cup: మరోసారి దాయాదుల సమరం: ఒకే గ్రూప్‌లో ఇండియా, పాకిస్థాన్.. మరో మూడు జట్లు ఏవంటే..?

2026 T20 World Cup: మరోసారి దాయాదుల సమరం: ఒకే గ్రూప్‌లో ఇండియా, పాకిస్థాన్.. మరో మూడు జట్లు ఏవంటే..?

భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ లో ఫిబ్రవరి 7 నుంచి జరగనుంది. ఈ మెగా టోర్నీ ఫైనల్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కన్ఫర్మ్ కాగా.. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.  ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ టోర్నీలో తొలిసారి 20 జట్లు ఆడుతుండడంతో ఆసక్తి నెలకొంది. ఐదు జట్లు నాలుగు గ్రూప్ లుగా విభజించబడతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు తదుపరి రౌండ్ కు అర్హత సాధిస్తాయి. 

టీ20 వరల్డ్ కప్ లో ఇండియా, పాకిస్థాన్ ఒకే గ్రూప్ లో ఉన్నట్టు సమాచారం. ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తల పరిస్థితుల కారణంగా ఇండియా, పాకిస్థాన్ జట్లను ఒకే గ్రూప్ లో ఉండవనే వార్తలు వచ్చాయి. అయితే దాయాధి జట్లు ఒకే గ్రూప్ లో ఉంచినట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇండియా, పాకిస్థాన్ తో పాటు యూఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్ కూడా ఒకే గ్రూప్ లో సెట్ చేసినట్టు సమాచారం. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆడతాయి. పాకిస్థాన్ తమ మ్యాచ్ లన్నీ శ్రీలంకలోని ఆడనుంది. 

ఆతిధ్య దేశాలైన భారత్, శ్రీలంక నేరుగా ఈ టోర్నీకి అర్హత సాధించాయి. 2024 టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 కు అర్హత సాధించిన దేశాలు 2026 వరల్డ్ కప్ కు తమ బెర్త్ లు ఖాయం చేసుకున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్‌, యూఎస్‌ఏ, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ ఈ లిస్టులో ఉన్నాయి. పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌ సూపర్ 8 కు అర్హత సాధించకపోయినా  ర్యాంకింగ్స్ పరంగా అర్హత సాధించాయి. దీంతో 20 జట్లలో క్వాలిఫై మ్యాచ్ లు ఆడకుండానే ఈ 12 టీమ్స్ 2026 వరల్డ్ కప్ కు అర్హత సాధించాయి.

క్వాలిఫయర్స్ ద్వారా కెనడా కూడా అర్హత సాధించి 13 వ జట్టుగా నిలిచింది. ఆ తర్వాత ఇటలీ, నెదర్లాండ్స్, జింబాబ్వే, నమీబియా క్వాలిఫై అయ్యాయి. 18, 19వ జట్లుగా ఒమన్, నేపాల్ నిలిచాయి. జపాన్ పై విజయంతో యూఏఈ 20 జట్టుగా నిలిచింది. మొత్తం 20 జట్లు టోర్నీకి అర్హత సాధించడంతో ఇప్పుడు గ్రూప్ లు ఎలా ఉండబోతున్నాయి ఆసక్తికరంగా మారింది. 
   
టీ20 వరల్డ్ కప్ కు అర్హత సాధించిన 20 జట్ల లిస్ట్ ఇదే:

భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్‌, యూఎస్‌ఏ, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, జింబాబ్వే, నమీబియా, ఒమన్, నేపాల్, యూఏఈ