పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో ముందొచ్చేది ‘ది రాజా సాబ్’ (The Raja Saab). మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ మూవీ 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్కి సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా ఫస్ట్ సింగిల్ ‘రెబల్ సాబ్’ పూర్తీ పాట రిలీజ్ చేశారు. తమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ లో ప్రభాస్ స్టైలిష్ స్టెప్పులతో రెచ్చిపోయాడు. ఆ రెబల్ స్టైల్, రెబల్ స్వాగ్ కి డార్లింగ్ ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా ఉంది.
ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ విజువల్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో రానున్న ఫస్ట్ సింగిల్తో మూవీపై మరింత క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ క్రేజీ హార్రర్ కామెడీ మూవీలో ప్రభాస్కు జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
