Raju Weds Rambai Box Office: చిన్న సినిమాకు బంపర్ వసూళ్లు.. 'రాజు వెడ్స్ రాంబాయి' రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

Raju Weds Rambai Box Office: చిన్న సినిమాకు బంపర్ వసూళ్లు.. 'రాజు వెడ్స్ రాంబాయి' రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

‘రాజు వెడ్స్ రాంబాయి’.. ఇపుడు ఈ మూవీదే హవా నడుస్తుంది. డైరెక్టర్ సాయిలు కంపాటి తెరకెక్కించిన ఈ మూవీ శుక్రవారం (2025 నవంబర్ 21న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ రూటెడ్ లవ్ స్టోరీకి ఆడియన్స్ థియేటర్లో బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీకి పోటీగా వచ్చిన మూడు సినిమాలను వెనక్కి నెట్టేసి బాక్సాఫీస్ దగ్గర దోసుకెళ్తోంది. అల్లరి నరేష్ '12 ఏ రైల్వే కాలనీ', ప్రియదర్శి 'ప్రేమంటే', రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్' సినిమాలకి మించిన పాజిటివ్ టాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ సొంతం చేసుకుని మంచి వసూళ్లు రాబడుతోంది.

ఈ సందర్భంగా డైరెక్టర్, నిర్మాత వేణు ఊడుగుల వసూళ్ల వివరాలను అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీ రెండు రోజుల్లో రూ.4.04 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుందని తెలిపారు. ఫస్ట్ డే (నవంబర్ 21న) తెలుగు రాష్ట్రాల్లోనే రూ.1.47 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ మూవీ.. రెండో రోజు రెట్టింపు వసూళ్లను సాధించడం విశేషం. 

కాగా ఈ మూవీ నెట్ వసూళ్ల విషయానికి వస్తే.. తొలిరోజు రూ.1.15 ఇండియా నెట్ సాధించగా.. రెండో రోజు శనివారం రూ.2.1 కోట్లు సాధించింది. వసూళ్ల దృష్ట్యా చూసుకుంటే.. చిన్న సినిమాకు బంపర్ వసూళ్లనే వచ్చాయనే చెప్పాలి. కేవలం మోత్ టాక్‌తోనే మరింత హైప్ క్రియేట్ అవుతుండడంతో థియేటర్లకు జనాలు క్యూ కడుతున్నారు.

►ALSO READ | టైప్ కాస్టింగ్ క్యారెక్టర్స్ చేయను: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సెన్సేషనల్ చైతన్య జొన్నలగడ్డ 

పెద్దగా హీరో, హీరోయిన్స్ లేరు.. డైరెక్టర్ ఎవరో కూడా తెలియదు.. కానీ, సినిమా కంటెంట్ మాత్రమే కింగ్ అని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించుకుంది. ప్రస్తుతం సినిమాకు వస్తున్న టాక్ చూస్తుంటే.. ఇంకో 10 రోజులు బాక్సాఫీస్ ని శాసించే సత్తా కంటెంట్ కి ఉంది. ఏమవుతుందో చూడాలి!!! 

రాజు వెడ్స్ రాంబాయి బ్రేక్ ఈవెన్ టార్గెట్:

ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని అందమైన లోకేషన్స్‌లో చిత్రీకరణ జరిగినట్లుగా సినీ వర్గాల టాక్. ఇక మొత్తం బడ్జెట్ విషయానికి వస్తే.. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషన్ ఖర్చులు కలిపి దాదాపు రూ.3 కోట్ల బడ్జెట్ అయినట్లుగా సమాచారం. ఈ క్రమంలో సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద రూ.3 కోట్ల షేర్.. 6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.