టైప్ కాస్టింగ్ క్యారెక్టర్స్ చేయను: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సెన్సేషనల్ చైతన్య జొన్నలగడ్డ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టైప్ కాస్టింగ్ క్యారెక్టర్స్ చేయను: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సెన్సేషనల్ చైతన్య జొన్నలగడ్డ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

బబుల్ గమ్, హిట్ 3 చిత్రాల్లో నటించిన చైతన్య జొన్నలగడ్డ ఇటీవల విడుదలైన ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీలో కీలకపాత్ర పోషించాడు.  ఇందులోని తన వెంకన్న పాత్రకు దక్కుతున్న ఆదరణ గురించి చైతన్య మాట్లాడుతూ ‘ఈ సినిమాకొస్తున్న రెస్పాన్స్ మేము ముందుగా ఊహించిందే. ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ముందునుంచీ నమ్మకంతో ఉన్నాం. ఆ నమ్మకమే నిజం అయ్యింది. ఇందులో నేను చేసిన వెంకన్న క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌కు ఆడియెన్స్ కనెక్ట్ అవుతున్నారు.

ఈ పాత్ర మేకోవర్ కోసం సెపరేట్‌‌‌‌గా కాస్ట్యూమ్స్ సెలెక్షన్ చేసుకున్నాం. గడ్డం పెంచి, నెత్తికి ఆయిల్‌‌‌‌తో చూడగానే భయపెట్టేలా ఆ పాత్రను డిజైన్ చేశారు దర్శకుడు. స్వతహాగా మాది  మిడిల్ క్లాస్ కావడంతో చాలా స్ట్రగుల్స్ చూశాను. ఆ అనుభవాల నేపథ్యం నటుడిగా పెర్ఫార్మ్  చేసేందుకు ఉపయోగపడుతోంది. తమ్ముడు సిద్ధు హీరోగా ఎదిగే టైమ్‌‌‌‌కు మా కుటుంబంలో అంతా సెట్ అయ్యింది.

నేను జీవితంలో స్థిరపడిన తర్వాతే నటుడిగా ప్రయత్నాలు మొదలుపెట్టాను. ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా పవన్ సాధినేని తెరకెక్కిస్తున్న చిత్రంతో పాటు దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంలో నటిస్తున్నా. ఫాదర్‌‌‌‌గా ఎమోషన్ ఉండే పాత్రలు చేస్తాను గానీ టైప్ కాస్టింగ్ క్యారెక్టర్స్ చేయాలనుకోవడం లేదు’ అని చెప్పాడు.