కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం పై తీవ్ర విమర్శలు చేశారు. SIR దేశ పౌరులు ఉద్దేశ పూర్వకంగా వేధించేందుకు చేసిన కుట్ర అని అన్నారు. పని ఒత్తిడితో బూత్ లెవల్ ఆఫీసర్లు చనిపోతున్నారని, ఇది అణిచివేత ప్రక్రియ అంటూ మండిపడ్డారు. SIR నిజమైన ఓటర్లను మోసం చేసేందుకు వీలు కల్పిస్తుందని అన్నారు.
కేవలం మూడు వారాల్లో గుండెపోటు, ఒత్తిడి, ఆత్మహత్యలు ఫలితంగా 16మంది BLOలు ప్రాణాలు కోల్పోయారు. SIR సంస్కరణ కాదు.. అణచివేత అని అన్నారు రాహుల్ గాంధీ. ఓ పక్క దేశం ప్రపంచానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ని అభివృద్ది చేస్తున్నప్పటికీ అత్యున్న త ఎన్నికల సంఘం మాత్రం కాగితపు పనులతో జంగల్ పనులు చేస్తుందంటూ సెటైర్లు వేశారు.
SIR కారణంగా పని ఒత్తిడి పెరిగి అనేకమంది BLO లు ఆత్మహత్య చేసుకున్నారని రిపోర్టులు వస్తున్న క్రమంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం పశ్చిమ బెంగాల్ లోని నాడియాలో ఓ మహిళా BLO ఆమె నివాసంలో ఆత్మహత్య చేసుకుంది.. SIR పని ఒత్తిడి కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు బాధితురాలి కుటుంబం ఆరోపించింది. దీనికి ముందు కూడా మధ్యప్రదేశ్ లోని రైసెన్ , దామో జిల్లాల్లో ఇద్దరు BLO లు చనిపోయినట్లు రిపోర్టులు చెబుతున్నారు.
