నవంబర్ 25న అయోధ్య రామమందిరంలో ధ్వజారోహణం.. ట్రాఫిక్ ఆంక్షలు

నవంబర్ 25న అయోధ్య రామమందిరంలో ధ్వజారోహణం.. ట్రాఫిక్ ఆంక్షలు

అయోధ్య రామమందిరంలో ధ్వజారోహణ కార్య్రమానికి అంతా సిద్ధమైంది. ఎల్లుండి (నవంబర్25)న ఉదయం 11.30 గంటలకు ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం ఆదిత్యానాథ్, గవర్నర్ హాజరు కానున్నారు. ధ్వజారోహణ ఉత్సవాలను పురస్కరించుకొని ఇవాళ్టి(ఆదివారం) అర్థరాత్రి నుంచి ఆలయ సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీ వాహనాల రాకపోకలు నిషేధించారు. వాహనాలను దారి మళ్లించేందుకు ఏర్పాట్లు చేశారు. 

ధ్వజారోహణ కార్యక్రమం అయోధ్య రామ జన్మభూమి ఆలయ ప్రధాన నిర్మాణం పూర్తియినట్లు సూచిస్తుంది. ఇది అయోధ్యలో ఆధ్యాత్మిక , సాంస్కృతిక మైలురాయిని అని చెప్పొచ్చు. అయోధ్య ధామ్ పేరు మరోసారి చరిత్ర పుటలలో సువర్ణాక్షరాలతో రాసుకోబోతోంది.. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో అయోధ్య ధామ్‌లో జరుగుతున్న ప్రతి పని భగవంతుడు శ్రీరాముని జీవిత విలువల నుంచి  ప్రేరణ పొందిందని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం Xలో పోస్ట్ ను షేర్ చేశారు. 

నవంబర్ 25న అయోధ్యలో జరిగే ఈ చారిత్రాత్మక ధ్వజారోహణం ఒక గొప్ప ఆలయ నిర్మాణం పూర్తి అయిన సందర్బంగా జరుపుకునే  ఉత్సవమే కాకుండా.. నగరాన్ని ఏకం చేసే సంప్రదాయం, ఆధ్యాత్మికత ,ప్రగతిశీల అభివృద్ధికి ఓ కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందని యోగి చెప్పారు.