ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ కోసం ఓపెనర్ ను వెతికే పనిలో ఉంది. ఆసక్తికర విషం ఏమిటంటే ఆస్ట్రేలియా చిచ్చర పిడుగు జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ ను రిలీజ్ చేసిన ఢిల్లీ.. మరోసారి ఈ యువ ఓపెనర్ నే టార్గెట్ చేయనుంది. మినీ ఆక్షన్ లో మెక్‌గుర్క్ ను తక్కువ ధరకు తీసుకోవాలని ఢిల్లీ భావిస్తోందట. 2025 మెగా ఆక్షన్ లో ఈ ఆసీస్ చిచ్చర పిడుగుని రూ. 9 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ లో మాతరం కనీస ధర రూ. 2 కోట్లకు తీసుకోనుందని సమాచారం. వికెట్ కీపర్ ను అవసరం కూడా ఢిల్లీకి ఉంది.
గత సీజన్ లో ఈ ఆసీస్ ఓపెనర్ ఘోరంగా విఫలమయ్యాడు. ఆరు మ్యాచ్ ల్లో కేవలం 55 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో అతను ప్లేయింగ్ 11 లో చోటు కోల్పోయాడు. మెక్‌గుర్క్ లేకపోయినా ఢిల్లీ విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం చూపదు అని తెలుస్తోంది. ఈ ఆస్ట్రేలియా ఆటగాడి గురించి చాలా చర్చలు జరిగినప్పటికీ ఢిల్లీ యాజమాన్యం తనను కొనసాగించడానికి ఆసక్తి చూపించలేదు. 22 ఏళ్ల జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ 2024 ఐపీఎల్ సీజన్ లో అదరగొట్టాడు. ఓపెనర్ గా వచ్చి మెరుపు ఇన్నింగ్స్ లు ఆడాడు. ఈ కారణంగా ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో ఈ ఆసీస్ చిచ్చర పిడుగుని రూ.9 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు.
మెక్‌గుర్క్ 2023లో దేశవాళీ క్రికెట్ లో కేవలం 29 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్ర సృష్టించి వెలుగులోకి వచ్చాడు. ఈ క్రమంలో లిస్ట్-ఏ (అంతర్జాతీయ వన్డేలు, దేశవాలీ వన్డే టోర్నీలు) క్రికెట్‌లో వేగవంతమైన శతకాన్ని నమోదు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. మొత్తంగా 38 బంతులు ఆడిన ప్రేజర్ 10 ఫోర్లు, 13 సిక్సర్లతో 125 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. బిగ్ బాష్ లీగ్ లో ఓపెనర్ గా వచ్చి పరుగుల వరద పారించి.. ఆసీస్ జట్టులో స్థానం సంపాదించాడు. వచ్చిన అవకాశాలను వృధా చేసుకున్న ఫ్రేజర్ ఆసీస్ జట్టులో చోటు కోల్పోవడంతో పాటు ఐపీఎల్ లో కూడా అతన్ని రిటైన్ చేసుకోకుండా వదిలేసుకున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ కాన్వేతో పాటు కివీస్ కీపర్-బ్యాటర్ సీఫెర్ట్.. మాజీ కేకేఆర్ స్టార్ క్వింటన్ డి కాక్ ఈ లిస్ట్ లో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరిని ఢిల్లీ కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జట్టులో అభిషేక్ పోరెల్ రూపంలో ఒక వికెట్ కీపర్ మాత్రమే ఉన్నాడు. రాహుల్ కు వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించే అవకాశం లేనట్టు తెలుస్తోంది.
ఢిల్లీ క్యాపిటల్స్ (DC):
రిటైన్:
అక్సర్ పటేల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, అజయ్ మండల్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారీ, మిచెల్ స్టార్క్, టి.నటరాజన్, ముఖేష్ కుమార్, దుష్మంత చమీర, కుల్దీప్ యాదవ్, నితీశ్ రానా.
రిలీజ్: మోహిత్ శర్మ, ఫాఫ్ డు ప్లెసిస్, సెడికుల్లా అటల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, మన్వంత్ కుమార్, దర్శన్ నల్కండే, డోనోవన్ ఫెరీరా
