అసెంబ్లీలో మాలల గురించి మాట్లాడింది మంత్రి వివేక్ ఒక్కరే: చెన్నయ్య

 అసెంబ్లీలో మాలల గురించి మాట్లాడింది మంత్రి వివేక్ ఒక్కరే: చెన్నయ్య

అసెంబ్లీలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఒక్కరే మాలల గురించి మాట్లాడారని మాల మహనాడు అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు.  మిగతా ఎమ్మెల్యే లు ఎవరూ కూడా నోరు విప్పలేదన్నారు. 

హైదరాబాద్ సరూర్ నగరో మాలల రణభేరిలో మాట్లాడిన చెన్నయ్య.. ఉద్యోగులెవరూ ఈ సభకు రాలేదని మాల జాతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. చరిత్ర గురించి తెలుసుకొని మాట్లాడాలని..మాల జాతి జోలికొస్తే  జాగ్రత్త అని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ చేస్తే 5 శాతం మనకు ఉద్యోగాలు ఎందుకు వస్తలేవని ప్రశ్నించారు. మాలలను తడి బట్టతో గొంతు కోశారని అన్నారు చెన్నయ్య. హైకోర్టులో  కేసు వేశానని వర్గీకరణను అడ్డుకుంటానని అన్నారు. మాలలందరూ ఐక్యంగా ఉండాలన్నారు. రోస్టర్ పాయింట్లను సవరించుకోవాలని సూచించారు.

మాల జాతికి అడ్డెవరూ లేరని అడ్డుపడే దమ్ము  కూడా ఎవరికి లేదన్నారు చెన్నయ్య.  ఒక కులాన్ని ముందు పెట్టుకొని  కొందరు ఆట ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. వర్గీకరణపై పోరాటం చేయటం లేదన్నారు.  మాల వర్గానికి చెందిన యువతకు ఉద్యోగాల కోసం పోరాడుతున్నామని చెప్పారు. మోదీ న్యాయ మూర్తుల చేత ఎస్సీ వర్గీకరణ చేయించారని ఆరోపించారు.  ఏపీ  సీఎం చంద్రబాబు దుర్మార్గుడని మండిపడ్డారు.  40 లక్షల మాలలు ఓటు వేసి ఆయనను గెలిపించారని చెప్పారు చెన్నయ్య.