కవల సోదరుల్లో మరొకరు మృతి.. ఇంట్లో గ్యాస్ లీకైన ఘటనలో ముగ్గురికి చేరిన మృతులు

కవల సోదరుల్లో మరొకరు మృతి.. ఇంట్లో గ్యాస్ లీకైన ఘటనలో ముగ్గురికి చేరిన మృతులు

తల్లాడ వెలుగు‌‌: గ్యాస్ లీకైన ఘటనలో చికిత్సపొందుతూ మరో బాలుడు చనిపోయాడు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లిలో గుత్తికొండ వినోద్ కుమార్, రేవతి దంపతులు నివసిస్తున్నారు.  రెండు రోజుల కింద ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయి మంటలు అంటుకోవడంతో వినోద్ నానమ్మ సుశీల, అతని కొడుకు తరుణ్ మృతి చెందిన విషయం తెలిసిందే. 

తీవ్రంగా గాయపడిన మరో కొడుకు వరుణ్(7) హైదరాబాద్ లోని ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతూ బుధవారం తెల్లవారుజామున చనిపోయాడు. సమ్మర్ సెలవులకు వచ్చిన వినోద్ చెల్లి కూతుళ్లు ప్రిన్సి, లింసి కూడా తీవ్రంగా గాయపడి సిటీలోనే చికిత్స పొందుతున్నారు. గంటలవ్యవధిలో ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. 

కొడుకుల మృతితో తల్లి రేవతి రోదిస్తున్న తీరు గ్రామస్తులను కంటతటి పెట్టించింది. వినోద్ మేనకోడళ్లకు ఇంకా సీరిస్ గానే ఉన్నట్లు తెలిసింది.