‘వార్ 2’ నుంచి మరో అప్డేట్.. యాక్షనే కాదు.. రొమాంటిక్ ట్రాక్స్‌‌ కూడా ఉంటాయన్న మేకర్స్

 ‘వార్ 2’ నుంచి మరో అప్డేట్.. యాక్షనే కాదు.. రొమాంటిక్ ట్రాక్స్‌‌ కూడా ఉంటాయన్న మేకర్స్

ఎన్టీఆర్,  హృతిక్ రోషన్ హీరోలుగా వస్తున్న చిత్రం ‘వార్ 2’. ఇటీవల విడుదలైన ట్రైలర్‌‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇందులో అద్భుతమైన యాక్షన్‌‌ సీక్వెన్సులే కాదు.. రొమాంటిక్ ట్రాక్స్‌‌ కూడా ఉండబోతున్నాయి అంటున్నారు మేకర్స్. దర్శకుడు అయాన్ ముఖర్జీ మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌‌ అప్‌‌డేట్ ఇచ్చాడు.  ‘ఆవన్ జావన్’ అంటూ సాగే ఈ పాటను ఈ వారంలో విడుదల చేయబోతున్నట్టు చెప్పాడు. 

 కియారా అద్వాని పుట్టినరోజు సందర్భంగా గురువారం ఈ సాంగ్‌‌ రిలీజ్ చేయబోతున్నారు.  హృతిక్ రోషన్, కియారా జంటపై ఈ రొమాంటిక్‌‌ సాంగ్‌‌ను చిత్రీకరించారు. ప్రీతమ్, అమితాబ్ భట్టాచార్య, అరిజిత్ సింగ్ కలిసి పాట కోసం పని చేశారు. హృతిక్, కియారా కెమిస్ట్రీ పాటకు ప్రత్యేక ఆకర్షణ కానుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌ ఆకట్టుకుంది. యశ్‌ రాజ్ ఫిల్మ్స్ సంస్థ  నిర్మిస్తోన్న ఈ సినిమా   ఆగస్టు 14న విడుదలకానుంది.