నిర్వాసిత బంధు ప్రకటించాలె

నిర్వాసిత బంధు ప్రకటించాలె
  • ఎమ్మెల్యే చెన్నమనేని ఇంటి ముట్టడికి  మిడ్​మానేరు నిర్వాసితుల యత్నం

వేములవాడ, వెలుగు :మిడ్​మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిం చాలని ముంపు గ్రామాల జేఏసీ అధ్వర్యంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​బాబు ఇంటి మట్టడికి నిర్వాసితులు యత్నించగా, వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్​ చేశారు. ముందుస్తుగా కొంత మంది లీడర్లను అదుపులోకి తీసుకున్నప్పటికీ, మిగిలినవారు మూలవాగు వెనక నుంచి ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి యత్నించారు. దీంతో అక్కడున్న పోలీసులు, నిర్వాసితుల మధ్య తోపులాట జరిగింది. తర్వాత వారందరిని అరెస్ట్​చేసి పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ రైతుబంధు, దళితబంధు లెక్కనే నిర్వాసితబంధు ప్రకటించి ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం, 2022 వరకు 18 ఏండ్లు నిండిన వారికి రూ.5 లక్షలు ఇవ్వాలన్నారు. ప్రతి కుటుంబానికి ఉపాధి చూపించాలని, వీలుకాకపోతే ప్రతి ఫ్యామిలీకి రూ. 25 లక్షల లోన్ ​ఇవ్వాలని డిమాండ్ ​చేశారు. ముంపు గ్రామాలను వీటీడీఏ పరిధి నుంచి తొలగించాలని, పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యలను నెలరోజుల్లోపు పరిష్కరించాలన్నారు. లేకపోతే నిరసనలు కొనసాగిస్తూనే ఉంటామన్నారు. ముంపు గ్రామాల జేఏసీ అధ్యక్షుడు కూస రవీందర్, లీడర్లు పిల్లి కనుకయ్య, కదిరె రాజ్​కుమార్​, బుర్ర శేఖర్,​ గాలిపెల్లి స్వామి, బాస రాజశేఖర్, హరికృష్ణ, కనుకయ్య, శ్రీనివాస్​ రెడ్డి, నాగరాజులతో పాటు 100 మందిని అరెస్టు చేశారు.